గోదావరిలో మునిగిన బోటు రెయిలింగ్ లభ్యం

 దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గత నెల 15న గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ఠ బోటు వెలికితీత ప్రక్రియలో పురోగతి కనిపించింది. కచ్చులూరు సమీపంలో బోటును గుర్తించిన ధర్మాడి సత్యం బృందం లంగరు సాయంతో బోటును ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో లంగరుకు వశిష్ఠబోటు రెయిలింగ్ చిక్కింది. పొక్లెయిన్ తో ఐరన్ రోప్ ను బలంగా లాగడంతో బోటు రెయిలింగ్ ఊడి వచ్చింది. ఒడ్డుకు చేర్చిన రెయిలింగ్ ను చూసిన అధికారులు, ధర్మాడి సత్యం బృందానికి బోటును వెలికితీయగలమన్న నమ్మకం బలపడింది. నదిలో 70 అడుగుల లోతులో బోటు ఉందని, కొద్దిదూరం ముందుకు కదిలిందని ధర్మాడి సత్యం తెలిపారు. రేపు మధ్యాహ్నంలోగా బోటును వెలికితీసే అవకాశముందని భావిస్తున్నారు.